శాకుంతలం.. బాక్సాఫీస్ ఆట ముగిసినట్లే!

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీని చాలా గ్రాండ్ గా ప్రమోట్ చేశారు. సినిమాలో కంటెంట్ లేకుండా ఎంత ప్రమోట్ చేస్తే ఏంటి ప్రయోజనం అన్నట్లుగా శాకుంతలం సినిమా పరిస్థితి అయ్యింది.

కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ తోనే ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే శాకుంతలం రిలీజ్ అయిన మొదటి రోజే రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోయింది. ఏ యాంగిల్ లో కూడా సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఈ నేపధ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

ఈ మూవీ మొదటి రోజు కాస్తా డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజుకి థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. చాలా మంది శాకుంతలం పక్కన పెట్టి దసరా మూవీని వీకెండ్స్ లో చూడటానికి వెళ్ళడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా వారం రోజులలో కలెక్షన్స్ ఏరియా వైజ్ గా చూసుకుంటే ఆంద్రప్రదేశ్ నైజాం ప్రాంతాలలో 2.48 కోట్ల షేర్ వచ్చింది.

ఇక తమిళనాడులో కేవలం 35 లక్షల షేర్ మాత్రమే రావడం విశేషం. దీనిని బట్టి సమంత సోలో సినిమాలపై తమిళ్ ఆడియన్స్ అంత ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 38 లక్షల షేర్ వచ్చింది. నార్త్ ఇండియాలో భారీగా ఖర్చు పెట్టి సమంత సినిమాని ప్రమోట్ చేసిన ఎవ్వరికి రీచ్ కాలేదని ఈ కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు. ఓవర్సీస్ లో ఇప్పటివరకు కోటి కాస్తా తక్కువగా షేర్ దక్కించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా సినిమాకు 4.28 కోట్ల రేంజ్ లో షేర్ రావడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 9 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. శాకుంతలం సినిమా 19 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. ఇంకా 14 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో షోలు లేక సినిమాను తీసేశారు. విరూపాక్ష సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మిగిలిన చోట్ల కూడా సినిమా తీసేసే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా సినిమా మీద 12 నుంచి 13 కోట్ల వరకు నష్టం వచ్చేలా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.