Samantha: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత?

Samantha: సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి కెరిర్ పై దృష్టి పెట్టింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తాను ఎక్కడికి వెళ్లినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా విడాకుల తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. నిత్యం ఏదో రకమైన కొటేషన్లు పెడుతూనే ఉంది. ఇక కెరీర్ పరంగా సమంత దూసుకుపోతోంది. చేతినిండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.

ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత సమంతాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సమంత మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఇక ఆ సినిమా కోసం సమంత కు భారీగానే రెమ్యునరేషన్ ముట్ట చెప్పబోతున్నారు అని తెలుస్తోంది.

సమంత తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెబ్ సిరీస్ లో నటించడం కోసం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ తెగ కష్టపడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.సమంతా సైలెంట్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడే కొద్ది రోజులు ఉండి పోవాలి నిర్ణయించుకుంది. అయితే గతంలో సమంతకు బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినప్పటికీ అనే బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం హిందీ సినిమాలను ప్రధాన టార్గెట్ గా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ వెబ్ సిరీస్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.