Samantha: ఈగోని వదిలేసి చూడండి….అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత.. వీడియో వైరల్!

Samantha: సమంత తన నాలుగేళ్ల వివాహబంధానికి గుడ్ బై చెప్పేసి పూర్తి దృష్టి అంతా తన కెరీర్ పై పెట్టింది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాలో తొలిసారి ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా కంప్లీట్ చేసి యశోద మూవీ చేస్తోంది. బాలీవుడ్,హాలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు రావడంతో సమంత సినిమాలతో బిజీగా నుండి ఈ క్రమంలోనే తనకు సమయం దొరికినప్పుడల్లా తను విహారయాత్రలకు విదేశీ ప్రయాణాలు చేస్తూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది. స్విట్జర్లాండ్ లో సమంత ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మంచు కొండల్లో తను చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో సమంత స్కింగ్ నేర్చుకుంటుంది. మంచు కొండల మధ్యలో స్కింగ్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ఈగోను ఇంటి దగ్గరే వదిలేసి రండి…అంటూ వారు చెప్పారు. ఎంత బాగా చెప్పారో కదా? అంటూ షేర్ చేసింది. న్యూ బిగినింగ్ స్టార్ట్ అంటూ స్కింగ్ హాష్ టాగ్ లతో సమంతా షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఏది ఏమైనా విడాకుల తర్వాత డిప్రెషన్ నుంచి దూరమై అటు కెరీయర్ ను, ఇటు తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే సమంత స్విజర్లాండ్ పైన మై తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తూన్నట్లు తెలుస్తోంది.