గత జన్మ విషయాల గురించి చెప్పుకొచ్చిన సాయి పల్లవి… తెలంగాణలోనే పుట్టనేమో?

అందాల నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి తన సహజ అందంతో, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలోనే సాయిపల్లవి తెలుగు, తమిళ, భాషలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తాజాగా సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

నక్సలిజం నేతృత్వంలో ఒక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా రవన్న పాత్రలో నటించగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది. విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది. దీంతో గత కొన్ని రోజులుగా సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హీరో రానా సాయి పల్లవి కూడా టీవీ షోలలో సందడి చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సాయిపల్లవి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఈ ఇంటర్వ్యూ ద్వారా సాయి పల్లవి విరాటపర్వం సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో “మిమ్మల్ని చాలా మంది తెలంగాణ ఆడపుడుచు అంటున్నారు కదా.. దీనిపై మీ సమధానం ఏంటి? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ” అవును చాలా మంది అలాగే అంటున్నారు. విరాటపర్వం సినిమా డైరెక్టర్ వేణు గారు కూడా ఇదే మాట అన్నారు. బహుశా నేను తెలంగాణలో పుట్టిఉంటానేమో.. అంటూ సాయి పల్లవి సమాధానం చెప్పింది. తర్వత ఇక రానా నుంచి ఏం నేర్చుకున్నారు అని యాంకర్ అడగగా.. ‘ఒక కథ అనుకున్నాక ఇంతే చేయొచ్చని అనుకునేదాన్ని కానీ.. ఒక కథ స్థాయిని పెంచడం రానా గారు నేర్పించారు. రానా గారు ఎంపిక చేసుకునే కథలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.