Sai pallavi: సినీ నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించారు.
నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది ఇందులో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో వరుసన ప్రమోషన్స్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా చిత్ర బృందం ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమానికి సాయి పల్లవి హాజరు కాలేదు.
గత కొద్ది రోజుల క్రితం తెలుగులో కూడా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ విడుదల చేసిన సమయంలో సాయి పల్లవి హాజరు కాలేదు ఇలా సాయి పల్లవి తరచూ ఈ సినిమా ప్రమోషన్లకు దూరం అవుతున్న నేపథ్యంలో అందుకు గల కారణాన్ని చిత్ర బృందం వెల్లడించారు ప్రస్తుతం సాయి పల్లవి తీవ్రమైన జ్వరం దగ్గు జలుబు వంటి జబ్బులతో బాధపడుతూ ఉందని అందుకే ఈమె ఈ కార్యక్రమానికి రాలేకపోయింది అంటూ ముంబై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో డైరెక్టర్ చందు మొండేటి తెలియజేశారు.
ఇలా తరచూ ప్రయాణాలు చేయడం వల్ల మరింత నీరసించిపోతారని ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సలహా ఇవ్వటంతోనే ఈ కార్యక్రమానికి రాలేకపోయిందని తెలియజేయడంతో సాయి పల్లవి అభిమానులు ఆమె తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. ఈ సినిమాతో చైతన్య మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారని చెప్పాలి.
