సుడిగాలి సుదీర్ నా హౌలే అంటూ ఆటపట్టించిన సాయి పల్లవి?

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విరాటపర్వం చిత్రబృందం పలు ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరాటపర్వం టీమ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న దిల్ సే కార్యక్రమానికి హాజరయ్యారు.ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి రానా, సాయి పల్లవి, సురేష్ బాబు హాజరయ్యారు.ఇకపోతే శ్రీముఖి సుధీర్ సాయి పల్లవి రానాను ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే సుదీర్ ని చూపిస్తూ శ్రీముఖి సాయిపల్లవి ఒక ప్రశ్న అడిగింది. తెలంగాణ భాషలో వేస్ట్ ఫెలో ని ఏమంటారు అని ప్రశ్నించగా సాయి పల్లవి సమాధానం చెబుతూ హౌలేగా అంటూ సుధీర్ ని చూస్తూ సమాధానం చెప్పింది. ఈ విధంగా సాయి పల్లవి సమాధానం చెప్పడంతో సుధీర్ షాక్ అయ్యాడు.

ఇలా సాయి పల్లవి హౌలేగా అనడంతో ఒక్కసారిగా కంగుతిన్న సుదీర్ తేరుకొని మీరు హౌలేగా అన్న కానీ హల్వా అన్నంత స్వీట్ గా ఉంటుంది అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా సుధీర్ తనని తాను సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక విరాటపర్వం సినిమా జూన్ 17వ తేదీ విడుదలై ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.