Sai Pallavi : సాయి పల్లవి మళ్లీ నో చెప్పిందిగా.!

Sai Pallavi :  ‘భోళా శంకర్’ సినిమా కోసం మొదట్లో సాయి పల్లవిని అనుకున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, రీమేక్ సినిమా కావడం వల్ల ఆ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పేసిందని అనుకున్నారు.
మెగాస్టార్ సినిమాకి సాయి పల్లవి నో చెప్పడమేంటని, కొన్నాళ్లు సాయి పల్లవిని మెగా ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకున్నారు కూడా సోషల్ మీడియా వేదికగా.
అయితే, ఆ తర్వాత సాయి పల్లవి అందుకు సంజాయిషీ ఇచ్చుకుందనుకోండి. అలా ఆ చర్చకు ముగింపు కార్డు పడింది. ఇక తాజాగా సాయి పల్లవి ఇంకో సినిమాకీ అలాగే నో చెప్పిందంటూ తాజా వార్త వేడి వేడిగా వడ్డించేయబడుతోంది.
అయితే, ఇప్పుడా హీరో మెగా హీరో కాదట. కానీ, ఓ ప్రముఖ హీరోనే అంటున్నారు. మంచి స్టార్‌డమ్ వున్న హీరో అని కూడా అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సాయి పల్లవి నో చెప్పడం వెనక కూడా రీమేక్ కారణమే వుందని చెవులు కొరుక్కుంటున్నారు.
అంటే, సాయి పల్లవి రీమేక్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడదా.? మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే, రీమేక్ సినిమాలకు నో చెప్పాలా.? అంటూ ఆమెని దుమ్మెత్తి పోస్తున్నారు. సాయి పల్లవి కమిట్మెంట్ అలాగే వుంటుంది మరి. అదే ఆమెని ఆ స్థాయిలో నిలబెట్టిందేమో కూడా.
ఈ ప్రాజెక్టు కోసం సాయి పల్లవికి ఏకంగా 2 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. అయినా కానీ, తిరస్కరించిందంటే, అమ్మో సాయి పల్లవికి నటన పట్ల వున్న ప్యాషన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవాలి. ఇటీవల ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది.
రానాతో సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్‌కి రెడీగా వుంది. అలాగే, మరో రెండు తెలుగు ప్రాజెక్టులు, తమిళంలో ఓ రెండు, మలయాళంలో ఒకటి.. ఇలా ఇప్పటికి సాయి పల్లవి చేతిలో ఆమె నచ్చి, మెచ్చి సైన్ చేసిన సినిమాలున్నాయ్.