Sai pallavi: రామాయణం సినిమాలో నటించడానికి అదే కారణం…..అసలు విషయం చెప్పిన సాయి పల్లవి?

Sai pallavi: సినీనటి సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో ఆయన ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకు 100% న్యాయం చేస్తారు. తాజాగా తండేల్ సినిమాలో బుజ్జి తల్లిగా మరోసారి సాయి పల్లవి తన నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన తల్లి డాన్సర్ కావడంతో చిన్నప్పటినుంచి తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదని అందుకే పలు డాన్స్ షోలలో కూడా పార్టిసిపేట్ చేశానని తెలిపారు. ఇక సినిమాలు అన్నా కూడా నాకు అంతే పిచ్చి ఉండేది అందుకే సినిమాలు చూడటం కోసం బుర్కా వేసుకొని థియేటర్లకు వెళ్లే దానిని ఇక హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేదాన్ని తెలిపారు..

ఇక చిన్నప్పటినుంచి నాకు సూర్య అంటే చాలా ఇష్టమని ఆయనతో కలిసి ఒక్కసారైనా నటించాలని కోరుకునేదాన్ని. ఇక ఆ కోరిక కూడా తీరిపోయింది అని తెలిపారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో తనకు శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసిగా నటించడం చాలా బాగా నచ్చిందని ఆ పాత్ర కోసం ఎర్రని చీర ఆ మేకప్ వేసుకోవడం తనకు బాగా నచ్చిందని తెలిపారు.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని కూడా ఈమె తెలియజేశారు. పౌరాణిక చిత్రాలలో నటించాలన్నది నా చిరకాల కోరిక అని సాయి పల్లవి తెలిపారు.

ఇలా పౌరాణిక చిత్రాలలో నటించాలని ఆసక్తితో ఎదురుచూస్తున్న నాకు రామాయణం సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పానని నా ఆ కోరిక కారణంగానే ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతున్నానంటూ తెలిపారు. ఇక ఫిట్నెస్ కోసం తాను జిమ్ కి పెద్దగా వెళ్లను. ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడటం ఖాళీగా ఉంటే డాన్స్ చేస్తూ ఉంటానని అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అంటూ సాయి పల్లవి వెల్లడించారు.