మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే సినిమాలపై శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలవుతున్న సినిమాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇదివరకు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.అదేవిధంగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చాలా అద్భుతంగా ఉందని విశ్వక్సేన్ నటన పై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా తాజాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన హీరోగా జంతువులతో మనిషికి ఉండే ఎమోషన్స్ ను అద్భుతంగా చూపెడుతూ 777 చార్లీ అనే సినిమాలో కుక్కను స్పెషల్‌గా చూపించబోతోన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ ,కన్నడ ,హిందీ భాషలలో విడుదలకానుంది.ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ పెట్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో భాగంగా రక్షిత్ శెట్టి పలికే సంభాషణలో తన పాత్ర ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక ఈ ట్రైలర్ చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ పై స్పందిస్తూ హీరో రానాకి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ స్పందిస్తూ నా హృదయం బరువెక్కింది… ఆ ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది సోదర రక్షిత్ శెట్టి నీపై నాకు గౌరవం పెరిగింది. ఇలాంటి మంచి సినిమాను మనకు అందిస్తున్న రానాకు థాంక్స్ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.