పాపం బ్రహ్మాజీ…అకౌంట్ క్లోజ్ చేసుకున్నాడు

brahmaji telugu rajyam

 ఒక్కోసారి మనం మాట్లాడే సరదా మాటలే మన మెడకు ఉచ్చు లాగా బిగిస్తుంది. మనం ఒక కోణం నుండి అలోచించి మాట్లాడితే అది మరో కోణంలో అర్ధం అయ్యి చివరికి బూమరాంగ్ అవుతుంది. సినీ నటుడు బ్రహ్మాజీ పరిస్థితి ప్రస్తుతం అలాగే తయారయ్యింది. హైదరాబాద్ వరదలపై తనదైన స్టయిల్ లో ఓ జోకు వేశాడు బ్రహ్మాజీ. “ఓ మోటారు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి” అంటూ పోస్ట్ పెట్టాడు.

brahmaji telugu rajyam

  అతనికి అది చిన్న విషయం మాదిరి అనిపించవచ్చు, అదే సమయంలో ఆయనకు హాస్యచతురత కొంచం ఎక్కువ కాబట్టి ఆ కోణంలో ఆయన పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎన్నడూ కూడా బ్రహ్మాజీ ఇలాంటి ట్రోల్స్ తో ఇబ్బంది పడలేదు. కొందరైతే బ్రహ్మాజీ తెలంగాణ ద్రోహి అంటూ కామెంట్స్ చేసారు, గత 24 గంటల నుండి విపరీతమైన ట్రోలింగ్ చేయటంతో ఇక తట్టుకోలేక బ్రహ్మాజీ ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేసుకున్నాడు. అది క్లోజ్ చేయటానికి ముందు ఒక వివరణ ఇచ్చుకున్నాడు.

 మొన్నటి వరదల్లో బ్రహ్మాజీ అపార్ట్ మెంట్ లోకి కూడా నీళ్లు వచ్చాయి. కారు సెల్లార్ లోకి వెళ్లలేకపోయింది. దీంతో బ్రహ్మాజీ, అతడి కుమారుడు దగ్గర్లోని మరో అపార్ట్ మెంట్ లో కారు పార్క్ చేసి ఫ్లాట్ కు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వరద వల్ల అది సాధ్యం కాలేదట. చుట్టుపక్కల జనాల సహాయంతో అతి కష్టమ్మీద ఇంటికి చేరుకున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్ ను దృష్టిలో పెట్టుకొని ఓ చిన్న జోక్ వేశానని, దాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతున్నాడు బ్రహ్మాజీ.

ఏదైమైనా కానీ ఆయన చేసిన చిన్న ట్విట్ దుమారాన్నే లేపింది. ప్రజా స్పందన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవటం కష్టం. అదే సమయంలో జరుగుతున్నా పరిస్థితులను గమనించి అందుకు తగ్గట్లు మాట్లాడటం కూడా చాలా అవసరం.