సుమ, అలీ కలిసి మరీ ఆడుకున్నారు.. పాపం బ్రహ్మాజీ పరువుపాయే!!

Ali And Suma Fun with Brahmaji In Big Celebrity Challenge

సుమ, అలీ ఇద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపిస్తే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరితో పాటుగా బ్రహ్మాజీ ఉంటే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. సుమ బ్రహ్మాజీని ఎలా ఆడుకుంటుందో ఇది వరకె ఎన్నో సార్లు చూశాం. తాజాగా బ్రహ్మాజీని సుమ అలీ కలిసి ఆడుకున్నారు. సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ షోలో ఈ వారం అలీ, బ్రహ్మాజీలు గెస్ట్‌లుగా వచ్చారు.

Ali And Suma Fun with Brahmaji In Big Celebrity Challenge
Ali And Suma Fun with Brahmaji In Big Celebrity Challenge

బ్రహ్మాజీ ఎంట్రీ ఇస్తూనే వెరైటీగా స్టెప్పులు వేశాడు. దానిపైనా సుమ పంచ్ వేసింది. ఆయన ఏజ్ వల్ల మొత్తం వణుకుతున్నాడంటూ బ్రహ్మాజీ మీద సుమ సెటైర్ వేసింది. మగవాళ్లకు అన్యాయం చేస్తోన్న సుమ.. కొత్త థంబ్ నెయిల్ ఇస్తున్నా అంటూ సుమ మళ్లీ పంచ్ వేసింది. ఇక్కడ లేడీస్ ఎవరైనా ఉన్నారా? అంటూ సుమపై బ్రహ్మాజీ అదిరిపోయే కౌంటర్ వేశాడు. దీంతో సుమ షాక్ అయింది. పక్కనే ఉణ్న అలీ, యాంకర్ రవి ఇద్దరూ కూడా పడలబడి నవ్వేశారు.

ఇక ఆ తరువాత ఒకతను మ్యాజిక్ చేసి అందులోంచి మందు బాటిళ్లను, అమ్మాయిలను తీసుకొచ్చాడు. దీనిపై కామెంట్ చేసిన అలీ బ్రహ్మాజీ పరువు తీసేశాడు. దుప్పట్లోంచి అమ్మాయి వచ్చింది కదా ఆ దుప్పటి నాకు ఇస్తే.. అవుట్ డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు బ్రహ్మాజికి అది ఇస్తాను అంటూ పరువు తీసేశాడు. ఆ తరువాత స్టేజ్ మీదకు డ్యాన్స్ చేయడానికి వచ్చిన బ్రహ్మీజిని దారుణంగా ఆడుకున్నారు. వీణ స్టెప్ వేసేందుకు బ్రహ్మాజీ రెడీ అవుతుండటం.. అలీ సైండ్‌లు చేయడంతో మొత్తం రచ్చ రచ్చగా మారింది.