జగన్ మంత్రి వర్గంలో కొలువుదీరిన నీటిపారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అంటే తెలియని వారుండరు. అసెంబ్లీ లో అనీల్ దూకుడు వ్యాఖ్యలు..ప్రతిపక్షంపై కౌంటర్లు… అటుపై మీడియా సమావేశాల్లో తొడగొట్టిన వ్యాఖ్యానాలతో అనీల్ బాగా పాపులర్ అయ్యారు. వీటన్నింటిని మించి నెల్లూరు రెడ్డీలను సైతం కాదని జగన్ మోహన్ రెడ్డి అనీల్ కు మంత్రి పదవి ఇవ్వడం అన్నింటికి మించిన తొలి సంచలనమైనప్పుడే! అనీల్ స్టామినా అర్ధం చేసుకోవాలి. జిల్లాలోని రెడ్డి వర్గానికి చెందిన బడా నేతల్ని పక్కనబెట్టి మరి బీసీ యాదవ వర్గానికి జగన్ పెద్ద పీట వేసి షాకిచ్చారు.
ఇక ఎన్నికలకు ముందు..ఆ తర్వాత కూడా అనీల్ జగన్ విథేయుడిగానే మెలుగుతున్నారు. పొలిటికల్ గా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలు కోవడం లేదు. అలా నెల్లూరునే శాషించే స్థాయికి చేరాడు. ఇక్కడే వచ్చింది సమస్యంతా. అలా రీచ్ అవ్వడమే రెడ్డీలకు నచ్చినట్లు లేదు. వెంకట గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయనణ రెడ్డి అనీల్ వైఖరిపై బహిరంగానే విమర్శలు చేసారు. అనీల్ తో పాటు ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు ఆయన బాటలోనే మిగతా రెడ్డీలంతా నడవాలని నిర్ణయించుకున్నట్లు ఉప్పందింది. జిల్లాలోని సీనియర్ రెడ్డీ నేతలంతా అనీల్ పై స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనీల్ తో సన్నిహితంగా ఉండే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ఒకే తాటి మీదకు వచ్చినట్లు తెలిసింది. మేకపాటి గౌతంరెడ్డి తటస్థంగానూ, ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి ఎవ్వర్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. అనీల్ వ్యతిరేక రెడ్డి వర్గం వీళ్లిద్దర్నీ కూడా కలుపుకుని జగన్ ముందుకెళ్తే యంగ్ మంత్రి ప్రాబల్యం తగ్గించిన వారుమవుతామని ప్రణాళిక వేస్తున్నారుట. మొత్తానికి అనీల్ కుమార్ యాదవ్ ని ఒంటరిని చేయాలని పెద్దగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల అతి చేస్తోన్న మంత్రుల తోకలు కట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.