Anil Kumar Yadav: 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించినప్పటికీ 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా వైసిపికి 11 సీట్లు రావడానికి గల కారణం ఏంటి అంటూ కొంతమంది ఇప్పటికీ తర్జనభరితన అవుతున్నారు. కొంతమంది ఈ ఓటమిని ఈవియంల పైకి నెట్టి వేయగా మరికొందరు మాత్రం అప్పుడప్పుడు నిజాలను బయటపెడుతున్నారు.
వైసిపి ఓటమిపాలు కావడానికి కారణం కార్యకర్తలను జగన్ పట్టించుకోకపోవడం అనేది ప్రధాన కారణం. తాజాగా ఈ విషయం గురించి అనిల్ కుమార్ యాదవ్ కూడా తన మాటలలో నిజం ఒప్పుకున్నారు. అవును మేము కార్యకర్తలను పట్టించుకోలేదు కానీ జగనన్న 2.0 మాత్రం మామూలుగా ఉండదని కార్యకర్తలకే పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. మేము కార్యకర్తలను పట్టించుకోకపోయినా వారు మాత్రం జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారని రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయాన్ని అందిస్తారని అనిల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీ పార్టీకి ఈ విధమైనటువంటి పోరాటాలు కొత్తేమీ కాదని తెలిపారు. మా పార్టీ పుట్టినప్పటినుంచి సుమారు పది సంవత్సరాలు పాటు పోరాటాలు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చామని అయితే ఇప్పుడు తిరిగి ప్రతిపక్షంలో ఉన్నామని, ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలపై ఎక్కడికక్కడ కేసులు పెడుతున్న కార్యకర్తలు మాత్రం వెనకడుగు వేయడం లేదని ఇలాంటి వారిని తమ గుండెల్లో పెట్టుకుంటాము అంటూ అనిల్ కుమార్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెడ్ బుక్ పేరుతో తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఈయన ఫైర్ అయ్యారు.
