చిత్రం: సదా నన్ను నడిపే
రిలీజ్ డేట్: 24/06/2022
బ్యానర్: ఆర్ పి మూవీ మేకర్స్
నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , వైష్ణవి పట్వర్ధన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ తదితరులు.
ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , ప్రభు ప్రవీణ్
నిర్మాతలు: ఆర్ పి మూవీ మేకర్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్
వానవిల్లు సినిమా హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరో కమ్ డైరెక్టర్ గా తెరకెక్కిన సినిమా సదా నన్ను నడిపే. ఇందులో ప్రతీక్ ప్రేమ్ కరణ్ సరసన వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇందులో రాజీవ్ కనకాల, నాజర్, నాగేంద్రబాబు, ఆలీ పలువురు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరో, దర్శకుడు, స్క్రీన్ ప్లే, సంగీతం అన్ని కూడా హీరో ప్రతీక్ ప్రేమ్ కరణే. స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన ఈ మూవీ నేడు అనగా జూన్ 24 న థియేటర్లలో విడుదల అయ్యింది.
కథ: హీరో మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) హీరోయిన్ సాహాతో (వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. మైఖేల్ జాక్సన్ ప్రేమను సాహా ఎంత రిజెక్ట్ చేసిన కూడా మైఖేల్ జాక్సన్ మాత్రం సిన్సియర్ గా లవ్ చేస్తూనే ఉంటాడు. ఇందులో సాహా తండ్రి రాజీవ్ కనకాల మైఖేల్ జాక్సన్ ప్రేమను అంగీకరించడు. అయినా కూడా మైఖేల్ ఎలా అయిన సాహా ప్రేమను పొందాలి అని పరితపిస్తూ చివరికి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి అయిన మరుసటి రోజే నుంచే సాహా మైఖేల్ జాక్సన్ ను దూరం పెడుతుంది. మరి పెళ్లి అయిన తర్వాత కూడా సాహా మైఖేల్ ను దూరం పెట్టడానికి గల కారణం ఏమిటి? మైఖేల్ జాక్సన్ సాహా మనసును మార్చి ఆమెకు దగ్గరవుతాడా? అన్న విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథా కథనం విశ్లేషణ : ఈ సినిమా గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాల మాదిరిగానే స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరకెక్కింది. ఇందులో ప్రేమ కథను హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్ ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా, స్వచ్ఛమైన ప్రేమతో ఎంటర్టైనింగ్ గా వెండితెరపై ఆవిష్కరించారు. కాగా ఈ సినిమాలో మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆఖరి రోజుల్లో అతనితో గడిపిన ఆ కొద్ది క్షణాలలో ఎంత ముద్దుల జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటాము అన్న విషయాన్ని చాలా బాగా చూపించారు. అదేవిధంగా ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడవచ్చు అన్న అంశాన్ని ఇందులో బాగా ఎమోషనల్ గా చూపించడంతో ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయిపోయారు.
నటీనటుల పనితీరు: హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ అద్భుతంగా నటించడంతో పాటుగా దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ వైష్ణవి పట్వర్ధన్ కూడా ఆమె పాత్రకు న్యాయం చేసింది అని చెప్పవచ్చు. అలాగే ఇందులో కమెడియన్ ఆలీ ఉన్నంతవరకు బాగా నవ్వులు పూయించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ఇందులో సంగీతం బాగుంది. అలాగే నందు కంపోజ్ చేసిన ఫైట్స్,ఈ సినిమాలో పలు సన్నివేశాలలోని బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ బాగున్నాయి.
రేటింగ్ : 2.75/5