మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి, రాజకీయాల్లో వున్నారో లేదో.. తెలియని పరిస్థితి. లేకపోవడమేంటి.? ఎంచక్కా వున్నారు.. తెలుగుదేశం పార్టీతోనే అంటకాగుతున్నారు. మీడియాకెక్కి తాను ఏ రాజకీయ పార్టీకి చెందనవాడినన్నట్లుగా విశ్లేషణలు చేసేస్తుంటారు సబ్బం హరి. ఒకప్పుడు ఆయన మాటల్లో కాస్తో కూస్తో విశ్వసనీయత కనిపించేది. ఇప్పుడది ఇసుమంతైనా లేదు. వీలు చిక్కినప్పుడల్లా వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడమే ఆయనకు పని. ఇందుకోసం టీడీపీ అనుకూల మీడియా ఆయనకు వుండనే వుంది. వారానికో పది రోజులకో ఆయన టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ ఛానల్ ముందుకొస్తారు. సుదీర్ఘంగా నడిచే ఇంటర్వ్యూలో కనిపిస్తారు.
ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇంకోటేదో కాదు, వైఎస్ జగన్ మీద నిందారోపణలు చేయడమే. అక్కడికేదో ప్రజలు తప్పు చేస్తున్నారనే భావన ఆయనకి చాలా చాలా ఎక్కువ. రాజకీయాలు కలుషితమైపోయాయి.. ప్రజల్లోనూ ఆ మార్పు కనిపిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగని కలుషితమైన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పకుండా వదిలెయ్యరు ఓటర్లు. సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. ఈలోగా రాజకీయ నాయకులు నోరు పారేసుకోవడమెందుకు దండగ.? వైఎస్ జగన్ ముందు ముందు రాజకీయంగా ఒంటరి అయిపోతారని సబ్బం హరి జోస్యం చెబుతున్నారు. అంతేనా, ఇంతవరకు ఎప్పుడూ చూడని చెత్త పాలన రాష్ట్రంలో వుందంటూ సబ్బం హరి ఆవేశకావేశాలకు గురవుతున్నారు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలొచ్చాక కూడా సబ్బం హరి ఇలా మాట్లాడటంలో ఉపయోగమేముంది.? అసలు ఎవరన్నా ఆయన మాటల్ని పట్టించుకునే పరిస్థితి వుందంటారా.? పక్కా పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోయారంటూ సబ్బం హరి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.