డౌట్ లేదు – వైజాగ్ లోని ఆ టాప్ లీడర్ జైలు కి వెళ్ళాల్సిందే ?? జగన్ టోటల్ స్కెచ్ ఇదే ! 

 

చట్టానికి దొరకనంత వరకు దోరలు, దొరికితే దొంగలు.. ఈ లోకంలో ఇలా చాలామంది చలామని అవుతున్నారు.. ఇక తమ పార్టీ అధికారంలో ఉందంటే వారి అక్రమాలకు అడ్డే ఉండదు.. ఆక్రమించుకోవడానికి అదుపు ఉండదు.. కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు అది సొంతం కావాలంటారు కొందరు అవినీతి పరులు.. ఇలాంటి వారు రాజకీయాల్లో చాలా మందే ఉన్నారు.. కానీ ఆ మరకలు కనబడకుండా పెద్దమనుషులుగా రంగులు పులుముకుంటారు.. ఇకపోతే విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటనతో రాజకీయ దుమారం చెలరేగింది..ఆ వివరాలు పరిశీలిస్తే..

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం రాజుకుంది.. ఈ సందర్భంగా సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తనకున్న ఆస్తులు పబ్లిక్ డొమైన్‌లోనే ఉంటాయని, మరెందుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో కూల్చివేస్తారని అధికారులపై సబ్బం హరి మండిపడ్డారు. దీంతో ఎంపీ సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సబ్బం ఎప్పటి నుండో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అలాంటిది జగన్ అండ్ కో ను సబ్బం నోటికొచ్చినట్లు మాట్లాడటం దుర్బాషలాడటంతో అక్కడున్న వారందరు ఆశ్చర్యపోయారు.

ఒకవేళ తన స్దలంకు ఆధారాలుగా తన దగ్గరున్న డాక్యుమెంట్లను చూపిస్తే సరిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళే అవకాశం ఎలాగూ ఉంది. అదీగాక ప్రభుత్వంపై నిరసన తెలిపే హక్కు కూడా ఉంది. కానీ ఇవేవి చేయకుండానే ఇంత రాద్దాంతం చేయడం సమంజసం కాదంటున్నారు అధికారులు.. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఇది వైసీపీ కుట్రనే అనే నిందలు వైఎస్ జగన్ పై వేస్తున్నారు.. అధికార ప్రభుత్వం తమపై కక్ష కట్టి ఇలా రోడ్డున పడేస్తుందని ఆరోపిస్తున్నారు.. ఇక ఈ విషయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందిస్తూ సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరి ఈ వివాదంకు ముగింపు ఏలా ఉంటుందో అనే ఆసక్తి ఈ విషయం తెలిసిన వారిలో నెలకొందట..