ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుండగా మరి కొందరు ఎమ్మెల్యేలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉండగా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలపై దృష్టి పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు బంధువు అనే సంగతి తెలిసిందే.
అయితే జగన్ విషయంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం పవన్ సూచనల మేరకు బాలినేని కేసులను విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కు అనుకూలంగా బాలినేని వ్యవహరించడం , పవన్ సూచనల మేరకు బాలినేని చేనేత వస్త్రాల్లో కనిపించడంతో జనసేన వైపు బాలినేని దృష్టి పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే బాలినేని పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలినేని వ్యవహారంపై సీఎం జగన్ కూడా దృష్టి పెట్టారని మరి కొందరు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బాలినేని వల్ల జగన్ కు షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇతర పార్టీలపై దృష్టి పెడుతున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సీఎం జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని అతివిశ్వాసం కలిగి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ తీరు వల్ల వైసీపీ కార్యకర్తలలో సైతం తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందనే సంగతి తెలిసిందే.