రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధినం చేసుకునే దిశగా సాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా పూర్తిగా స్వాధినం చేసుకుంది. కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా సైన్యం బాంబు పేలుళ్లతో అట్టుడికించింది. ముందుగా కీవ్ దగ్గరలోని ఎయిర్‌స్ట్రీప్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. తర్వాత క్రమంగా కీమ్ నగారాన్ని నలువైపులా ముట్టడించి
కీమ్‌పై పూర్తిగా పట్టు సాధించింది. తమకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాపోయారు. రష్యా పై పోరాటంలో తాము ఒంటరయ్యామని ఆయన ఆవేదన చెందారు. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 137 మంది మృతిచెందినట్లు సమాచారం. రష్యా దాడితో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడాన్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి