రష్యా సైన్యం మరోసారి కాల్పుల విరమణకు సమ్మతించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటల నుండి కాల్పులు విరమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. కీవ్, ఖార్కివ్, మరియుపోల్, సుమీ పట్టణాల్లో కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ వినతి మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.