రష్యా బాంబు దాడిలో నిండు గర్భిణి మృతి

రష్యా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులును కొనసాగిస్తోంది. రాజధాని కీవ్ నగరం చుట్టూ బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా జరిసిన బాంబుదాడిలో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. గర్భిణి మృతికి సంబంధించిన దృశ్యాలను అమెరికా వార్తా సంస్థ ప్రసారం చేసింది. ఈ దాడిపై నెటిజన్లు.. రష్యాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిండు గర్భిణి పరిస్థితి చూసి చలించిపోయారు.