భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్ సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉక్రెయిన్ రష్యా వివాదంపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ సమగ్రతను, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కచ్చితంగా గౌరవించాల్సిందేనని ఇరువురూ అభిప్రాయపడ్డారు. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలంటే చట్టాలను గౌరవించడమే ఏకైక మార్గమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టాలు, భౌగోళిక సమగ్రతపై భారత్‌కు అపారమైన నమ్మకం ఉందని.. మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇక… భారత పర్యఃటనకు రావాలని ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని జాన్సన్‌ను ఆహ్వానించారు