ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కి రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో తెలుగు నుంచి ట్రిపుల్ ఆర్(RRR) సినిమా కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన భారీ పీరియాడిక్ విజువల్ వండర్ ఇది. తారా స్థాయి అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి కూడా షాకిచ్చే నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. టికెట్ ధరలు తగ్గించేసి ఈ ‘RRR’ లాంటి సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు.
ఇప్పుడు దీనిపైనే చిత్ర బృందం తీసుకున్న సంచలన నిర్ణయం కోసం చెప్పారు. ఇప్పుడు ఈ టికెట్ ధరల వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతున్న మాట నిజం కానీ మేము దీనిపై ఇంకా కోర్ట్ కి వెళ్ళాలి అనుకోలేదు అని ఊహించని ట్విస్ట్ చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఏపీ సీఎం తో మాట్లాడి సామరస్యంగా పరిష్కారించాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. మరి ఈ చర్చలు ఎంతమేర సఫలీకృతం అవుతాయో చూడాలి.