ఓటీటీ లో “RRR” ఈ వెర్షన్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే.!

Rrr this version  : టాలీవుడ్ మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). భారీ స్థాయిలో తెరకెక్కి అన్నే అంచనాల నడుమ రిలీజ్ అయ్యి రికార్డ్ వసూళ్లను కొల్లగొట్టింది. ఒక్క తెలుగు లోనే 600 కోట్లకి పైగా వసూళ్లను ఈ చిత్రం కొల్లగొట్టింది. అయితే ఇక ఈ సినిమా థియేటర్లు లలో 50 రోజులు పూర్తి చేసుకోవడంతో ఓటీటీ లో స్ట్రీమింగ్ కి డేట్ ని అనౌన్స్ చేశారు.

అయితే సౌత్ భాషల్లో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 వారు ఆల్రెడీ ఈ మే 20 నుంచి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చెయ్యగా హిందీ వెర్షన్ పై అంతా ఆసక్తి గా చూస్తున్నారు. అయితే దీనికి తాజాగా దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ వెర్షన్ తమ నుంచి రాబోతుంది అని అది కూడా ఈ జూన్ 2 నుంచి తీసుకొస్తున్నామని మాస్ అనౌన్స్మెంట్ చేశారు. దీనితో ఈ డేట్ సెన్సేషన్ గా మారింది.

ఇంకా ఈ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్ మరియు సముద్రకని, శ్రేయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే డివివి దానయ్య 500 కోట్ల మేర బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఇలా పే పర్ వ్యూ లాంటి వాటిలో తీసుకుని రాకపోవడం ఒక మంచి విషయం అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.