RRR Movie : వైరల్ : ప్రభాస్ ఫ్యాన్ కి అమర్యాద గానే రిప్లై ఇచ్చిన “RRR” యూనిట్.!

RRR Movie : సోషల్ మీడియాలో గౌరవం అనేది వెతుక్కోకూడదు అవతల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కొంతమంది అత్యుత్సాహ నెటిజన్స్ ఇష్టమొచ్చిన మాట అనేస్తుంటారు.
పైగా వారి ఫోటో ఉండదు వివరాలు ఉండవు కానీ ఇష్టమొచ్చినట్టు అందరిపై కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఇది ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఇలాంటి అవమానాలు కామెంట్స్ ఎదురవుతూ ఉంటాయి.
వాటిలో కొంతమంది కొన్ని లైట్ గా తీసుకున్నా మరి కొంత మంది అయితే సరైన సమాధానం ఇచ్చి పడేస్తారు. ఇప్పుడు ఇలానే ఒక ఇన్సిడెంట్ సోషల్ మీడియా వేదికగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ కి మరియు భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) యూనిట్ కి జరిగింది.
ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి అంతా బానే ఉంది నిన్ననే చిత్ర యూనిట్ “నాటు నాటు” సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంలో RRR యూనిట్ ని ఉద్దేశించి కొమురం భీముడో సాంగ్ రిలీజ్ చెయ్య’రా’ అని అమర్యాదగా పోస్ట్ పెట్టాడు.
దీనికి బదులుగా చిత్ర యూనిట్ మీడియా కూడా దానికి “ఇంకా టైం ఉందిరా” అంటూ వీళ్లూ తగ్గకుండా రిప్లై ఇచ్చారు. దీనితో దెబ్బకి దెబ్బ సరిపోయింది అని ఇతర నెటిజన్స్ అనుకుంటుండగా ఈ రిప్లై లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://twitter.com/RRRMovie/status/1513500144368762882?s=20&t=4UPfsH48rxTjHo7zpI2NFA