RRR : ఈ విషయంలో “బాహుబలి 2” ని టచ్ కూడా చెయ్యలేకపోయిన “RRR”

RRR : ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తిరుగు లేని దర్శకుడు రాజమౌళి. ఈ స్టేట్మెంట్ లో కూడా ఎలాంటి తిరుగు లేదు. అయితే రాజమౌళికి ఇండియన్ వైడ్ ఇంత గుర్తింపు రావడానికి గల కారణం తన బాహుబలి రెండు చిత్రాలే అని చెప్పాలి. వాటిని అంత అమోఘంగా తాను చెక్కడంతోనే భారతదేశ వ్యాప్తంగా కూడా రాజమౌళి పేరు మారు మోగింది.

ఇక దాని తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అనుకున్న సమయంలో ఊహించని విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపాడు. ఇక ఇప్పుడుకి ఈ చిత్రం పూర్తయ్యి ప్రపంచ వ్యాప్తంగా బాహుబలిని మించి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా ఈ చిత్రం మాత్రం బాహుబలి హవా దగ్గర తలొగ్గక తప్పలేదు.

ట్రిపుల్ ఆర్(RRR) ట్రైలర్ కి 24 గంటల్లో 20 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా ఎపుడో నాలుగేళ్లు కితం వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ కి మాత్రం 21.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనితో బాహుబలి రికార్డు ని ‘RRR’ టచ్ కూడా చెయ్యలేకపోయింది. మరి దీనికి ఇలా ఉంటే బాక్సాఫీస్ పరంగా అయినా బాహుబలి 2ని ఈ చిత్రం క్రాస్ చేస్తుందేమో చూడాలి.