హాలీవుడ్ అవార్డ్స్ లో అరుదైన ఘనత అందుకున్న “RRR” చిత్రం.!

RRR

లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం ఘనత ఇంకా కూడా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుండగా దర్శకుడు రాజమౌళి హీరోలు ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల పేర్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 

అయితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీనితో హాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా ఎంతో మెప్పించిన ఈ చిత్రం రీసెంట్ గా హాలీవుడ్ సినిమా దగ్గర కూడా ఒక అరుదైన ఘనతను అందుకుంది. 

అక్కడ ప్రముఖ క్రిటిక్ సంస్థలో బెస్ట్ సినిమాల 10 లిస్ట్ లో ఈ సినిమా కూడా ఎంపిక అయ్యి ఫస్ట్ టైం ఎంపిక అయ్యిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఎంపికలో ఆ అవార్డు వారు బెస్ట్ సినిమాలు అనౌన్స్ చేయగా ఈ లిస్ట్ లో RRR సినిమా రెండో స్థానంలో నిలవడం విశేషం. 

మొదటగా ఈ చిత్రం అసలు హాలీవుడ్ సినిమాలతో ఎంపిక కావడమే ఒకెత్తు అయితే మళ్ళీ అందులో టాప్ 2 లో నిలవడం నిజంగా సెన్సేషన్ అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం మన సినిమాకి వస్తున్న ఆడాన తారా స్థాయిలో ఉందని చెప్పాల్సిందే. 
shttps://twitter.com/HCAcritics/status/1542902028094976001