మరోసారి “RRR” కొత్త ప్రింట్ రిలీజ్..ఎప్పుడు ఎక్కడ అంటే..!

RRR movie : దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ మాస్ ఏక్షన్ ట్రీట్ ట్రిపుల్ ఆర్(RRR). పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో ఏళ్ల తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లతో దుమ్ము లేపింది.
ముఖ్యంగా అయితే ఓవర్సీస్ లో ఏకంగా 15 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లతో హిస్టారికల్ రన్ ని అక్కడ అందుకుంది. సరే ఇప్పుడు ఈ సినిమా 50 రోజులు కూడా పూర్తయ్యిపోయింది. దీనితో లాస్ట్ టైం ఒక్కసారి మాత్రం ఒక స్పెషల్ షో ని తీసుకొస్తున్నారట.
అయితే ఇది మన దేశంలో కాకుండా ఎక్స్  క్లూజివ్ గా అన్ కట్ సీన్స్ కలిపి ఒక కొత్త ప్రింట్ ని యునైటెడ్ స్టేట్స్ అమెరికా లో తీసుకొస్తున్నారట. అది కూడా కేవలం ఒకే ఒక్కరోజు సెకండ్ షో కి మాత్రం తీసుకొస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇంతకీ అది ఏ డేట్ లో అయితే ఈ ఏడాది జూన్ 1వ తారీఖున అట.
అయితే దీనికి ఇంకా సమయం ఉంది కానీ ప్రస్తుతం అయితే ఈ సినిమా ఈ ప్రత్యేక ప్రింట్ పై ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా అజయ్ దేవగన్ మరియు సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.