Number 1 In World Box Office : “RRR” సునామి..భారీ వసూళ్లతో వరల్డ్ లోనే నెం.1 సినిమాగా నిలిచిన వేళ.!

Number 1 In World Box Office : మళ్లీ మన ఇండియన్ సినిమా దమ్ము ఏంటో వరల్డ్ బాక్సాఫీస్ చూస్తుంది. గతంలో “బాహుబలి 2” తో రికార్డు స్థాయి వసూళ్లు కొల్లగొట్టిన రాజమౌళి ఇప్పుడు తన ట్రిపుల్ ఆర్(rrr) సినిమాతో అంతకు మించిన వండర్స్ ని నమోదు చేస్తున్నాడు.
అయితే ఈ భారీ సినిమా మొదటి రెండు రోజులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆల్ టైం రికార్డ్ వసూళ్ళనే కొల్లగొట్టగా ఇప్పుడు ఏకంగా ఒక వరల్డ్ ఫీట్ నే సెట్ చేసిన మాట సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
గడిచిన మూడు రోజుల్లో అంటే మార్చ్ 25 నుంచి 27 తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ స్ధాయి వసూళ్లు అందుకున్న నెంబర్ 1 సినిమాగా నిలిచి రికార్డ్ సృష్టించింది అట. మరి ఈ లిస్ట్ లో పలు భారీ హాలీవుడ్ సినిమాలు సైతం ఉన్నా కూడా వాటిని మించి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు రోజుల వసూళ్ళ పరంగా టాప్ లో నిలబడింది అట.
మరి ఈ లిస్ట్ లో నంబర్ 1 స్థానంలో RRR – 64 మిలియన్ డాలర్స్ తో ఉండగా దీని తర్వాత హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ “ది బ్యాట్ మ్యాన్” – 45.5 మిలియన్, 3వ స్థానంలో “ది లాస్ట్ సిటీ” – 34.7 మిలియన్, 4వ స్థానంలో “అన్ చార్టెడ్” – 12.7 మిలియన్ డాలర్స్, అలాగే ఫైనల్ గా “మూన్ ఫాల్” చిత్రం 10 మిలియన్ డాలర్లు వసూళ్లతో టాప్ 5 గా నిలిచాయి.
అయితే ఇలా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఒక ఇండియన్ సినిమా టాప్ లో నిలవడం రెండోసారి అని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఇలా మన తెలుగు సినిమా ప్రపంచంలో నెంబర్ 1 గా నిలవడం అనేది మన తెలుగు సినిమాకే కాకుండా ఇండియన్ సినిమాకే గర్వకారణం అని చెప్పాలి.
మొత్తానికి అయితే రాజమౌళి – రామారావు – రామ్ చరణ్ ల కాంబో సెన్సేషన్ ని నమోదు చేస్తుంది అని చెప్పాలి.
https://twitter.com/meJat32/status/1508138993925431302?t=tdE87pxRvs_VLdzYOKHrrA&s=19