ప్రభాస్ సునామీ ముందు నిలబడలేని “RRR”.!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియన్ స్థాయిలో నిలబెట్టి మంచి ఫేమ్ ని ఇచ్చింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. ఇది వాస్తవం కూడా. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ని ఎలా నిలుపుకోవాలి అనేది అతని చేతుల్లోనే ఉంది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా తన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్ ప్రూవ్ చేస్తుంది.
ఈ సినిమాపై హిందీ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇంకో పక్క రాజమౌళి తీసిన సినిమా (ట్రిపుల్ ఆర్ “RRR”) కూడా హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కానీ హిందీ ఆడియెన్స్ లో భారీ రెస్పాన్స్ ని అందుకున్న ఆల్బమ్ గా మాత్రం ప్రభాస్ ని RRR కొట్టలేకపోయింది.
రాజమౌళి సినిమా నుంచి వచ్చిన అన్ని సాంగ్స్ కన్నా నిన్న రిలీజ్ అయ్యిది రాధే శ్యామ్ సాంగ్ కి భారీ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లెక్కన హిందీ ఆడియెన్స్ లో ప్రభాస్ ముద్ర ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి బాక్సాఫీస్ పరంగా ఈ రెండు చిత్రాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో అనేది కూడా కీలకం.