RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ విడుదల చేసిన జీ 5… వీడియో వైరల్!

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇలా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను మే 20 వ తేదీ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జీ 5 ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.రెండు నిమిషాల 31 సెకన్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో భాగంగా ప్రతి ఒకరి పాత్రను ఎంతో అద్భుతంగా చూపించిన సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. థియేటర్ లో విడుదలయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.