RRR Effect On Radhe Shyam : ఇన్సైడ్ టాక్ : ‘RRR’ వల్ల “రాధే శ్యామ్” రిలీజ్ కి మరో తేదీని కూడా అనుకుంటున్నారా?

RRR Effect On Radhe Shyam : ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ సినిమా కోసం టాలీవుడ్ లో ప్రభాస్ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఈ జనవరి 14న సినిమా విడుదల అవుతుంది అనుకుంటే మళ్లీ కరోన దెబ్బకి ఆగిపోవాల్సి వచ్చింది. ఇక దీని తర్వాత ఈ భారీ సినిమాని మార్చ్ 14 కానీ 18 కానీ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు టాక్ వినిపించింది. ఆ తర్వాత 18న ఫిక్స్ అయ్యినట్టు తెలియగా దానిని అనౌన్స్ చేసే లోపు మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) వారు దాన్ని లాక్ చేసి షాక్ ఇచ్చారు.

దీనితో రాధే శ్యామ్ యూనిట్ సందిగ్ధంలో పడ్డారట. మరి ఇప్పుడు రాధే శ్యామ్ రిలీజ్ పై ఇన్ సైడ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. దీనితో అయితే ఒకవేళ రాజమౌళి సినిమా మార్చ్ 18న రిలీజ్ చేస్తే తమ సినిమాని ఇంకో వారం గ్యాప్ ఇచ్చి మార్చ్ 25 న కానీ ఒకవేళ అవ్వకపోతే 18 నే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారట. దీనితో ఈ రెండు డేట్స్ పై వారు దృష్టి పెట్టినట్టు ఇప్పుడు తెలుస్తోంది.