గుండెలపై నాగబాబు పేరు పచ్చబొట్టు వేయించుకున్న ఆర్పీ.. షాక్ అయిన నాగబాబు..!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. కానీ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కొందరు కమెడియన్లు వారి వ్యక్తిగత కారణాల వల్ల జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారు. జబర్దస్త్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు ఆ షో కి దూరమైన తర్వాత ఆయనతోపాటు కొంతమంది జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఇతర చానల్ వారు ఇచ్చే అధిక రెమ్యునరేషన్ కారణంగా మరి కొంతమంది జబర్దస్త్ కు స్వస్తి చెప్పారు. ఇలా నాగబాబు మీద ఉన్న అభిమానంతో జబర్దస్త్ కి దూరమైన కమేడియన్స్ లో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు.

మొదటి నుండి నాగబాబు అభిమాని అయిన ఆర్పి నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళిపోయాడు . జబర్దస్త్ నుండి వెళ్లిన తర్వాత నాగబాబు మాటీవీలో ప్రసారం అయిన కొన్ని టీవీ షోస్ కి జడ్జ్ గా వ్యవహరించారు. కొన్ని రోజుల క్రితం వరకు మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ షో కి కూడా నాగబాబు జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ షోని మా సూపర్ సండేస్ పేరుతో ప్రసారం చేయనున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సుధీర్ కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. ఈ షో లో సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా.. అనసూయ కూడా నాగబాబు పక్కన జడ్జి గా వ్యవహరిస్తోంది.

ఇక ఈ షో లో కిర్రాక్ తన లవ్ స్టోరీ గురించి ఒక స్కిట్ చేసి అందరినీ మెప్పించాడు. ఈ క్రమంలో సుధీర్ మాట్లాడుతూ ఆర్పీ ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తాడో అన్న విషయం గురించి చెబుతూ.. నాగబాబు పేరు ని ఆర్పీ గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న విషయం కూడా చెప్పాడు. ఈ విషయం తెలుకున్న నాగబాబుతో పాటు అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. వెంటనే నాగబాబు ఆర్పీ ని దగ్గరకు పిలిచి ఈ విషయం నాకెప్పుడూ చెప్పలేదేంట్రా అంటూ ఆర్పీని హత్తుకున్నారు. ఇక సందర్భంలో ఆర్పీ మాట్లాడుతూ.. నేను అందరికీ ఒక్కటే చెప్తా..మనమందరం నాగబాబు గారి నవ్వు నుండి పుట్టిన వాళ్ళమే అంటూ చెప్పుకొచ్చాడు.