Kirak RP: జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పి ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇక ఈ రెస్టారెంట్ బిజినెస్ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఇటీవల కాలంలో ఆర్పి రాజకీయాల గురించి కూడా స్పందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈయన కూటమి పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ వైకాపా పార్టీపై అలాగే వైకాపా మంత్రులు నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైకాపా మాజీ మంత్రి జబర్దస్త్ మాజీ జడ్జ్ సినీ నటి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
రోజా గురించి నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆర్పి వార్తలలో నిలుస్తుంటారు. ఇకపోతే తాజాగా రోజా గురించి మాట్లాడుతూ ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ అవినీతిలో భాగంగా ఈమె మరో మూడు నెలలలో జైలుకు వెళ్లడం కూడా ఖాయం అంటూ రోజా అరెస్టు గురించి ఆర్పి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఈమె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వందల కోట్ల అవినీతి చేసిందని ఈమెతోపాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ అవినీతిలో భాగమయ్యారు అంటూ ఆర్పి కామెంట్లు చేశారు. ఇలా ఆర్పి రోజా అరెస్ట్ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి మరి ఈ విషయాలపై రోజా ఏవిధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.