R.K Roja -Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన సినిమాల గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.. ఈయన ఆడియో కాల్ లీక్ అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్టీఆర్ పట్ల బూతులు మాట్లాడటమే కాకుండా అనంతపురంలో ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాని అడ్డుకుంటామంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆడియో పై ఇప్పటికే ఎమ్మెల్యే స్పందించిన సంగతి తెలిసిందే.
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నాపై కుట్ర చేస్తున్నారని కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందని తెలిపారు. తాను ఎన్టీఆర్ ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అందుకు తాను క్షమాపణలు కూడా చెబుతున్నానని వెల్లడించారు. అయితే నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెప్పడం కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు టిడిపి పార్టీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలోనే ఈ ఘటన గురించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన సినిమాలను అడ్డుకుంటామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని తెలిపారు. సినిమాలు బాగుంటే వాటిని ఆపటం ఎవరి తరం కాదు అందుకు అభిమానులే సాక్ష్యం. దయచేసి రాజకీయాలను సినిమాలను ఒకటి చేయొద్దు అంటూ ఈ సందర్భంగా రోజా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇలాంటి వివాదం జరుగుతున్నప్పటికీ ఈ వివాదంపై ఎన్టీఆర్ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.
