తులాభారంలో పాల్గొన్న రోజా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!

నటిగా, రాజకీయ నాయకురాలుగా మంచి గుర్తింపు పొందిన రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన రోజా నటిగా మంచి గుర్తింపు పొందింది. తర్వాత దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయింది. కొంతకాలం తర్వాత అడపాదడపా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కొంతకాలం తర్వాత రోజా ఈటీవీ ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా వ్యవహరించింది. ఆ సమయంలోనే రాజకీయాల్లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇలా నటిగా రాజకీయ నాయకురాలిగా రోజా మంచి గుర్తింపు పొందింది.

రోజా జబర్దస్త్ కామెడీ షో లో 9 సంవత్సరాల పాటు జడ్జిగా వ్యవహరించింది . ఆ సమయంలో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ మరొకవైపు టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలో రోజా గారికి మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో ఆవిడ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రజలకు సేవచేయడానికి టీవీ షోలను వదులుకుంది. గత కొన్ని రోజులుగా రోజా మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తోంది.

రోజా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాలను ప్రజలతో తన అభిమానులతో పంచుకుంటూ ఉంది ఈ క్రమంలో ఇటీవల రోజా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో రోజా తులాభారం లో పాల్గొంది. ఈదుల వారంలో రోజా గారి బరువుకు సమానమైన ఆహార ధాన్యాలు పప్పు దినుసులు ఉంచి వాటిని పేదరికంలో ఉన్న ప్రజలకు అందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ బరువెంత అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తులాభారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.