Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 60 వాహనాలు!

Accident: రోడ్లపై నిత్యం ఏదో ఒక పొరపాటు వల్ల ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తాయి. ఇదిలా ఉంటే తాజాగా.. అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. నిత్యం మంచు కురిసే ప్రాంతం కావడంతో అక్కడ ఇప్పటికీ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజానికి ఆ ప్రాంతంలో వాహనాలతో ప్రయాణించడం చాలా కష్టం.

అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో జాతీయ రహదారిపై తీవ్రమైన మంచు కురవడం వల్ల దాదాపు 60 వాహనాలు ఒకదాని వెంట మరొకటి ఢీకొన్నాయి. పైగా కొన్ని వాహనాలకు మంటలు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా చాలా వరకు చాలా మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.