అభిమానులకి లేటుగా గుడ్ న్యూస్ చెప్పిన ‘ప్రభాస్’ హీరోయిన్ !

Richa Gangopadhyay has revealed on social media that she has given birth to a boy

రిచా గంగోపాధ్యాయ…దగ్గుబాటి రానా తొలి చిత్రం ‘లీడర్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమై మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు,నాగవల్లి చిత్రాలతో అలరించింది. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో కనిపించింది రిచా గంగోపాధ్యాయ. తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలలో స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్ అవుతుంది అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ… చిత్ర పరిశ్రమకి గుడ్ బై చెప్పేసింది.

Richa Gangopadhyay has revealed on social media that she has given birth to a boy

సోషల్ మీడియా ద్వారా సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించి అమెరికాలో స్థిరపడింది. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతూ ఆమె వెండితెరకు గుడ్ బై చెప్పింది. చిన్ననాటి స్నేహితుడైన ‘జో లాంగేల్లా’ను వివాహమాడిన రిచా … మొదట్లో తన పెళ్లి గురించి సమాచారం ఇవ్వకుండా దాచి పెట్టింది. అయితే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా సీక్రెట్‌గా ఉంచి చాలా ఆలస్యంగా బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది.

అదే అలవాటును కొనసాగించిన రిచా… తాజాగా తను మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా కొంచెం లేటుగానే షేర్ చేసింది. మే 27న తనకు బాబు పెట్టాడని ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త నెట్లో యమా స్పీడ్ గా వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన రిచా అభిమానులు తమ అభిమాన హీరోయిన్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ, బాబుని ఆశీర్వదిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.