రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పిన RGV సిస్టర్  

తన సినిమాలకంటే కాంట్రోవర్సిస్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్‌ గోపాల్‌ వర్మ తన రూటే సపరేట్ అంటాడు. ఏ అంశం మీదైనా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ, తాను హ్యూమన్ రిలేషన్స్ కి విలువ ఇవ్వను అని చెప్తూ ఉంటారు. అయితే తాను చిన్నతనంలో ఎలా ఉండేవాడో అలాంటి వర్మ బాల్యంలో ఉండేవాడో, తాజాగా ఇంటర్వ్యూ లో చెప్పారు వర్మ చెల్లి విజయలక్ష్మి.

తొలిసారి మీడియా ముందుకు వచ్చారు ఆయన సోదరి. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో  విజయ లక్ష్మి కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పారు. తన మాటలు, తీరుతో అందరిని ఆశ్చర్యపరిచే వర్మ.. 9 ఏళ్ల వయసులో కుటుంబానికి షాకిచ్చాడట. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి అన్నయ్య(ఆర్జీవీ) భిన్నంగా ఆలోచించేవాడు. అసలు ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదు. తొమ్మిదేళ్ల వయస్సులోనే తన మేధస్సుతో ఇంట్లో వాళ్లను ఆశ్చర్యపరిచాడు. ఓసారి మా మామయ్యతో నేను, అన్నయ్య సినిమాకు వెళ్లాం. తిరిగి వచ్చాక మామయ్యను తన సందేహం తీర్చమని అడిగాడు అన్నయ్య.

‘ఆ మూవీలో ట్రైన్‌ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్‌ను ఏర్పాటు చేశారు. కొంత టైం సెట్ చేసి.. ఆ రైలు అక్కడకు రాగానే పేలిపోయేలా ప్లాన్ చేశారు.’ ఇదే విషయాన్ని అన్నయ్య మామయ్యను అడిగాడు. అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడు. దీనికి నిజమే కదా అని అనుకున్నారు. అలా అప్పటి నుంచే అన్నయ్య ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, లాజికల్‌గా థింక్ చేయడం ప్రారంభించారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆర్జీవి అమ్మాయిల పిచ్చోడు అనే అంశంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ లక్ష్మి స్పందిస్తూ.. అందరూ అనుకున్నట్లు ఆయనకు అసలు అమ్మాయిల పిచ్చి లేదు అని చెప్పారు.

‘చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెతో నీ కళ్లు చాలా బావున్నాయి అని చెప్పేశాడు. అది విని నేను షాక్ అయ్యా. ఆ తరవాత చాలాసార్లు నా స్నేహితురాలు మీ అన్న నన్ను పొగిడాడు అని చెప్పుకునేది. అయితే నేను వర్మతో.. దానికి మెల్లకన్ను, నీకు ఎలా నచ్చింది అని అడిగా.. దానికి అన్నయ్య ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను’ అని చెప్పాడు. మరోసారి బ్యాంకులో ఇంకో అమ్మాయి నవ్వు బాగుందని ఆమెతోనే చెప్పాడు.. అలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేసింది లేదు. అలాగే ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్‌లు వేయడం కూడా అలాంటిదే’ అని అసలు విషయం చెప్పారు వర్మ చెల్లి.