RGV Is Using RRR : ‘ఆర్ఆర్ఆర్’ని వర్మ అలా వాడేస్తున్నాడుగా.!

RGV Is Using RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ కోసం క్షణం కూడా తీరిక లేకుండా ఇద్దరు హీరోల్ని వెంటేసుకుని దేశమంతా తిరిగేశాడు జక్కన్న రాజమౌళి. అది రాజమౌళి స్ట్రేటజీ. అయినా అది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. అంతలా కష్టపడ్డారు కనుకే ఆ సినిమాకి పట్టం కట్టారు అభిమానులు.

 అన్నిచోట్లా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సక్సెస్ చేశారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించీ కాదు, జక్కన్న ప్రమోషన్స్ గురించీ కాదు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వున్నారు కదా.. పబ్లిసిటీ యందు వర్మగారి పబ్లిసిటీ దారే వేరు.
మన కర్మ కాలిపోయి ఆయన దర్శకత్వం నుంచి ‘డేంజరస్’ అనే సినిమా ఒకటి రూపుదిద్దుకుంది. లెజ్బియన్ కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా ఇది. నైనా గంగూలీ, అప్సరా రాణి లీడ్ రోల్ పోషించారీ సినిమాలో.
హాట్ హాట్ పోస్టర్స్‌తో ఇప్పటికే తనదైన ప్రమోషన్ పిచ్చిని ఇప్పటికే జనాల మీద రుద్దేశాడు మనోడు.
ఇది చాలదన్నట్టుగా ఇదేదో రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమా అన్నట్లుగా, ఇద్దరు ఆడంగిల్ని అదేనండీ హీరోయిన్లనిద్దరినీ వేసుకుని దేశమంతా తిరిగేస్తూ ‘డేంజరస్’ సినిమాని తెగ ప్రమోట్ చేసేస్తున్నాడు.
అయ్యగారి ప్రమోషన్ స్కిల్ చూసి, ఇదేం ఖర్మరా బాబూ.! అంటూ సగటు సినీ ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.
ఎవ్వరేమనుకుంటే అనుకోనీ, డోంట్ కేర్.. అనే నైజం వర్మది. ఇంకా నయం, ఆయన పేరులో ఎలాగూ ‘ఆర్’ వుంది కాబట్టి, హీరోయిన్ల పేర్లకు కూడా ‘ఆర్’తో లింకులెట్టేసి, ‘ఆర్ఆర్ఆర్’ అని ప్రచారం చేసేయలేదు.. అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అమ్మో.. చేసినా చేస్తాడు. వర్మ అక్కడ.