Rewanth Reddy: హరీష్ రావు పై దారుణమైన కామెంట్లతో మండిపడ్డ రేవంత్ రెడ్డి!

Rewanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ఆరోగ్య మంత్రి హరీష్ రావు మీద ఫైర్ అయ్యాడు. పైగా దారుణమైన కామెంట్లతో ట్వీట్ చేశాడు. ఇటీవలే వరంగల్ ఎంజీఎం లో ఓ రోగిపై ఎలుకల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలువురు మంత్రులు విమర్శలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు పై విమర్శలు చేశాడు.

ఆరోగ్య మంత్రి హరీష్ గారు.. కేసీఆర్ కిట్టి లో మీతో పాటు కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కేసీఆర్ కిట్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి.. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించే ఏర్పాట్లు చెయ్యండని.. పేదల పట్ల మానవత్వం చూపించండి అని ట్వీట్ చేశాడు.