అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అంటూ కేసీఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ప్రస్తుతం కేసీఆర్ పర్యటనలో భాగంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పంజాబ్ ఉండగా అక్కడ మృతి చెందిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశాడు. దీంతో ఈ విషయం గురించి రేవంత్ రెడ్డి విమర్శలు చేశాడు.

అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో.. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫామ్ హౌస్ గడపదాటి ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని.. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదు అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు.