గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. కారు-నూరు అనుకున్న తెరాస పార్టీకి రక్త కన్నీరు మిగిలించిన గ్రేటర్ ఓటర్లు బీజేపీని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి దారుణమైన షాక్ ఇచ్చారు . దీనితో ఏకంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయటంతో ఖాళీ ఏర్పడిన ఆ పదవి రేవంత్ రెడ్డి తో పూరించే అవకాశం ఉందని సృష్టంగా తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ చేయాలనీ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న కానీ, పార్టీ లోని సీనియర్ నేతలు అడ్డు పడటంతో ఆ విషయం పెండింగ్ లో పడింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ తనకు తానే రాజీనామా చేయటంతో దాదాపుగా రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే లెక్క.
ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితుడు అయ్యాడనే మాటలు వినిపిస్తున్నాయి, ఇక అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి వుంది. మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 9 వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రేవంత్ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తినే నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పుడు ఒక ముళ్ల కిరీటమనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శవాసనం వేసి ఉంది. పార్టీలోని బలమైన నేతలందరూ పక్క పార్టీల వైపు వెళ్తున్నారు, ఇక ఎటు వెళ్లలేని ముసల ముతక నేతలు మాత్రమే ఉన్నారు, వాళ్ళ వలన పార్టీకి పట్టుమని పాతిక ఓట్లు కూడా పడే అవకాశం కనిపించటం లేదు. పార్టీకి దన్నుగా నిలిచే నేతలెవరూ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఢిల్లీ స్థాయిలో కూడా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి స్థితిలో అధికారం లోకి రావటం కంటే ముందు పార్టీని రేస్ లో నిలపెట్టటమే అతి పెద్ద సవాల్