Revolt of Bheem: టైం మార్చారు

Revolt of Bheem: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి ‘Revolt of Bheem’ పేరుతో భీం (ఎన్టీఆర్) తిరుగుబాటుకు సంబంధించిన వీడియో సర్ప్రైజ్ కాస్త ఆలస్యంగా రానుంది. ఇవాళ సాయంత్రం4 గంటలకి సర్ప్రైజ్ వీడియో విడుదల చెయ్యాల్సి ఉంది. కానీ, ఆ వీడియోని ఈరోజు రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకుగల కారణాలు తెలియచేయలేదు.

కాగా ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రని రాంచరణ్ పోషిస్తుండగా, కొమరంభీం పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు ‘జక్కన్న’ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. మరి నాలుగో పాట ఎటువంటి దుమారం లేపుతుందో చూడాలి.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు అలియాభట్, అజయ్ దేవగన్ లు కీలకపాత్రలను పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.