ఆ విషయాలు బయటపెడితే మాకు విడాకులే: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింన ఈ అమ్మడు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తాన్ సత్తా నిరూపించుకొని గ్లోబల్ బ్యూటీ గా గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఈ అమ్మడు టాలీవుడ్ లో రాంచరణ్ సరసన కూడా జంజీర్ అనే సినిమా చేసింది.ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా విడాకుల విషయం గురించి మాట్లాడింది. దీంతో ఈ విడాకుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీలో విడాకుల తీసుకోవటం కొత్త విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్న జంటలు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విడాకులు విషయం చాలా కామన్ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా వయసులో తన కన్నా చిన్నవాడైన నిక్ జొనస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలం క్రితం వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలలో నిజం లేదని వీరిద్దరూ నిరూపించారు. ఇటీవల ప్రియాంక చోప్రా, నిక్ దంపతులు సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ప్రియాంక చోప్రా స్వయంగా తానే తన విడాకుల గురించి నోరు జారింది.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి బయట పెట్టమని చాలామంది అడుగుతుంటారు. అయితే తను అలా చేయకపోవటానికి కూడా ఒక కారణం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా ఒక పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. సాధారణంగా పంజాబీలు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ మేరకు ప్రియాంక చోప్రా కూడా సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంది. అందువల్ల ప్రియాంక చోప్రా తన పర్సనల్ విషయాల గురించి బయటకు చెబితే ఎక్కడ వారి దాంపత్యానికి దిష్టి తగిలి విడాకులు తీసుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో తన పర్సనల్ విషయాలను బయటపెట్టనని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.