Renu Desai: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూనే సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇకపోతే రేణు దేశాయ్ ఇటీవలే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలన్నీ అవాస్తవాలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి సినిమాను అనౌన్స్ చేయలేదు రేణు దేశాయ్.
కాగా అనాథ పిల్లలు, పర్యావరణం, మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తుంటుంది. అలాగే తన ఫాలోవర్స్‌ని కూడా ఈ మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. కాగా జంతు ప్రేమికురాలైన రేణూ దేశాయ్ క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం తన కూతురు ఆద్య పేరు మీదగా ఒక ఎన్‌జీవోను కూడా స్థాపించింది. అలా మూగ జీవాలను కూడా సొంత మనుషుల్లా చూసుకునే రేణూ దేశాయ్ కు ఒక వ్యక్తి చేసిన పనితో చిర్రెత్తుకొచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది రేణూ దేశాయ్. అందులో ఒక వ్యక్తి ఒక చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో కనిపించాడు.
దీనిని గమనించిన కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ పెట్టి ప్రశ్నించింది. రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దుతుగా కామెంట్లు పెట్టారు. ఇలా జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. అలాంటి వెధవలను కఠినంగా శిక్షించాలి అంటూ మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.