రేణు దేశాయ్ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే

Renu Desai project shelved

Renu Desai project shelved

ఒకప్పుడు హీరోయిన్ గా పవన్ సరసన రెండు సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న రేణు దేశాయ్ కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యలో ఏవేవో ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినా ఏదీ పూర్తికాలేదు. అన్నీ నిదానంగా నడుస్తున్నాయి. వాటి అప్డేట్స్ ఏంటో కూడ బయటకు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆమె ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ను డీ.ఎస్.రావు, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మించాలనుకున్నారు. సత్యాన్వేషణలో ఒక మహిళ ప్రయాణం ఎలా ఉంటుంది అనేదే ఈ వెబ్ సిరీస్ థీమ్ అని రేణు స్వయంగా తెలిపారు. ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓగా కనిపిస్తానని చెప్పుకొచ్చారు.

వెబ్ శిరీష్ పేరు ‘ఆద్య’ అని కూడ అన్నారు. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ మొదలైంది. కానీ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. అందుకు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణమని తెలుస్తోంది కానీ ఆ విబేధాలు ఎవరి వైపు నుండి అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రీస్టార్ట్ అయ్యే సూచనలైతే కనిపించట్లేదు. సో.. రేణు దేశాయ్ రీఎంట్రీ అర్థాంతరంగా ఆగిపోయినట్టే అనుకోవాలి. మరి రేణు ఇంతటితో తన ప్రయత్నాలకు ఫులుస్టాప్ పెడతారా లేకపోతే వేరే ఏదైనా ప్రాజెక్ట్ చూసుకుంటారా అనేది చూడాలి.