టీడీపీ కి గుడ్ బై చెప్పిన కొడాలి నాని అటుపై వైకాపాలోకి మంత్రి అవ్వడం టీడీపీని ఎండగట్టడం గురించి తెలిసిందే. టీడీపీ పేరెత్తితే నాని ఒంటికాలుపై లేచి పడతారు. చంద్రబాబు నాయుడు.. లోకేష్ ని విమర్శిచడంలో నానిది అందవేసిన చేయి. సమయం..సందర్భం వచ్చినప్పుడల్లా నాని టెన్నీస్ కోర్టులో బంతిలా టీడీపీ ని ఆడుకుంటారు. ప్రతిపక్షానికి రీ సౌండ్ లేకుండా దుయ్యబడుతుంటారు. తాజాగా సీఈసీ రమేష్ కుమార్ విషయంలో నాని తనదైన శైలిలో విమర్శలు చేసారు. రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నలలో నడుస్తాడు అన్న విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పునిచ్చినా, ప్రజల కోసం అనుకున్న పనిచేసి తీరుతామన్నారు. గుడివాడ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించన అనంతరం నాని పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే? గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే జగన్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందన్నారు. తెలుగుదేశం వాళ్లు టీడీపీ పేరు తీసేసి సీబీఎన్ లేదా చంద్రబాబు ఖర్జూర నాయుడు అని పేరు పెట్టుకుంటే బాగుటుందని ఎద్దేవా చేసారు.
రమేష్ కుమార్ ఎస్ఈసీగా వచ్చినా చిటికిన వేలు పై ఉండే బొచ్చు కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. కింద కోర్టులోన్యాయం జరగకపోతే పైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేసారు. అయితే నిమ్మగడ్డ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్దం అవుతుంది. హైకోర్టులో తీర్పులపై రివ్యూ చేసుకుని అపిల్ కు సంబంధించి సాధ్యాసాధ్యాలు అన్నింటిని పరిశీలించి సవాల్ చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది.