కరోనా సెకండ్ వేప్ ప్రారంభం కావడంతో ఫ్రాన్స్ మరోసారి లాడ్ డౌన్ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరగడం మొదలు పెట్టాయి. ఒకే రోజు సుమారు యాభై వేల కేసులు నమోదు కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. లాడ్ డౌన్ విధిస్తే తప్ప కరోనాను కట్టి చేయడం సాధ్యం కాదని గ్రహించి శుక్రవారం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. ప్యారిస్ లోని ఇరుకైన ఇళ్లలో ఉండేకన్నా స్వస్థలాలకు వెళ్లాలన్న తాపత్రయంలో ప్రజలంతా ఒక్కసారిగా వీధుల్లో వచ్చేయడంతో ఏకంగా కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది.
మొదటి సారి లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఏర్పడిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన నగరాల్లో ఉండే కన్నా స్వస్థలాలకు వెళ్లిపోవాలన్న ఆకాంక్ష ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కలిగింది. సేమ్ ఇదే సీన్ ప్యారిస్ లో కూడా రిపీట్ అయింది. అయితే ప్రజల నుంచి ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. దీంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడంతో ఏకంగా ఏడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
ముఖ్యంగా వీకెండ్ సమయంలో లాక్ డౌన్ ప్రకటించం తప్పు అయిందని సర్కారు అంగీకరించింది. అంచెల వారీగా లాక్ డౌన్ ప్రకటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు భావిస్తోంది. మొత్తం మీద ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న ప్యారిస్ వాసులు ఏకంగా రెండు రోజుల పాటు కష్టపడాల్సి వచ్చింది. మరో వైపు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం లో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కనివినీ ఎరుగని రీతిలో ఏర్పడిన ఈ ట్రాఫిక్ జాం విజువల్స్ కు ఈపాటికే కోట్లాది ఫ్యూస్ వచ్చేశాయి.