Trivimram: మాటల మాంత్రికుడు ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు మాత్రం త్రివిక్రమ్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అద్భుతమైన రైటర్ గా గుర్తింపు పొందారు అనంతరం దర్శకుడుగా మారి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం జులాయి. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ రాజేంద్రప్రసాద్ వద్దకు వెళ్లే సమయంలో రాజేంద్రప్రసాద్ పూజ గదిలో పూజ చేస్తూ కూర్చుని ఉంటారు.
అయితే ఇక్కడ ఎన్నో దేవుళ్ళ చిత్రపటాలు ఉంటాయి ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజన్ ఈ సినిమాను చూస్తూ త్రివిక్రమ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పూజ గదిలో అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ ఫోటోలను త్రివిక్రమ్ పెట్టారు.తాజాగా ఒక ఎక్స్ యూజర్ జులాయ్ సినిమా చూస్తూ.. ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసి తన పోస్ట్ లో షేర్ చేశారు.
ఇలా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు అసలు నువ్వు మనిషివేనా త్రివిక్రమ్ నీకెలా ఇతర మతాలకు చెందిన దేవుళ్ల ఫోటోలను హిందూ దేవుళ్ళతో కలిపి పెట్టాలని ఆలోచన వచ్చింది అంటూ మండిపడుతున్నారు. ఈ ఫోటోని షేర్ చేసిన నెటిజన్ జులాయి మూవీ చూస్తుంటే కనిపించింది.. సరిగ్గా చూడండి.. అలా ఎలా ఆలోచించావు త్రివిక్రమ్ అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశారు సదరు నెటిజన్. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై త్రివిక్రమ్ విశ్లేషణ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.