తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వెంటనే వీఆర్వోలు తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 లోపల వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను ప్రభుత్వానికి అందజేయాలి. అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ రికార్డులపై సమగ్ర నివేదిక కావాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. కొత్త రెవెన్యూ చట్టం కోసమే ప్రభుత్వం దీనికి పూనుకున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే.. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. ఈరోజు నుంచి ఈ స్టాంపులను అధికారలు విక్రయించడం లేదు. వాటి విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు.
ఒకవేళ ఇప్పటికే ఈ-చలానా చెల్లించి ఉంటే మాత్రం ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విధివిధానాలను రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు జారీ చేశారు.
అయితే.. కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక.. దాని ప్రకారం.. ఎమ్మార్వోల పరిధిలోనే రిజిస్ట్రేషన్లను చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి.. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తారా? అన్నదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.